
వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా శుక్రవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రభుత్వం కేటాయించిన 25 నెంబర్ క్వార్టర్ లో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు నూతన గృహప్రవేశం చేశారు. వారి ఇలవేల్పైన శ్రీ గోవిందరాజుల స్వామి, శ్రీ రాజరాజేశ్వరి- శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటాలతో నూతన క్వార్టర్ లో గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది దంపతులకు శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి, మిఠాయి తినిపించారు.
ముఖ్యమంత్రి ని కలసిన ప్రభుత్వ విప్..
బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కేటాయించిన క్వార్టర్స్ లోనికి గృహప్రవేశ అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట వారి కుటుంబ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.