హర్యానాలో 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌

హర్యానా: హర్యానా ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకూ కాంగ్రెస్‌తో దోస్తీ కోసం చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. గురువారం తన చివరి జాబితాను విడుదల చేసింది. ఏడో జాబితాలో భాగంగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం 90 స్థానాలకు ఆప్‌ అభ్యర్థులను ప్రకటించినట్లైంది.