చిన్నారులను ఆశీర్వదించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ- తిరుమలగిరి
తిరుమలగిరి మండల విశ్వఖర్మ సంఘం అధ్యక్షులు మారోజు ఈశ్వరాచారి – పుష్పల కుమారుడు మారోజు విధ్యాధరాచారి (చిట్టి బాబు) – పల్లవి ల కుమార్తెలు గ్రీష్మ- తనుశ్రీల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఆదివారం మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన చైర్మన్ శ్రీకాంత్ రాజ్ ను అధ్యక్షులు ఈశ్వరాచారి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు విశ్వబ్రాహ్మణ సంఘం హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మారోజు సోమన్న, తాడోజు ఆచారి, బుక్క శ్రీనివాస్, సురేష్, నరేష్, పోలోజు నాగరాజు, నాగాచారి తదితరులు పాల్గొన్నారు.