
– సైనిక సంక్షేమం బీఆర్ఎస్ మర్చిపోయిందని అసహనం
– రానున్న ఎన్నికల బరిలో మాజీ సైనికోద్యుగులు
నవతెలంగాణ-బెజ్జంకి
అబ్ కీ బార్.. జవాన్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశ రక్షణ కోసం వివిధ విభాగాల్లో పనిచేసిన మాజీ సైనికోద్యుగులు తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో నిలుస్తారని సకల జనుల పార్టీ వ్యవస్థాపకులు,మాజీ సైనికోద్యోగి రావుల రంగారెడ్డి గురువారం తెలిపారు.మాజీ సైనికుల సంక్షేమాన్ని మరిచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో హుస్నాబాద్,మానకొండూర్ నియోజకవర్గాల నుండి రావుల రంగారెడ్డి, జీ.కృపారావు అబ్ కీ బార్.. జవాన్ కిసాన్ సర్కార్ నినాదంతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచి ప్రజల్లోకి వెళ్లనున్నట్టు రంగారెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని అయా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ఈ నెల 27న ప్రకటించనున్నట్టు రంగారెడ్డి పెర్కొన్నారు.