
మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఉన్న ప్రజ్ఞ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి అక్షయ్ కుమార్ సీనియర్ లెవెల్-4 కేటగిరీలో ప్రతిభ కనబరిచినట్టు పాఠశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విశ్వం ఎడ్యుకేట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో విజువలైజేషన్ లో ర్యాంకు సాధించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. అబాకస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి అక్షయ్ కుమార్ ను పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు, తల్లిదండ్రులు విద్యార్థిని అభినందించి హర్షం వ్యక్తం చేస్తూ జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిమ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.