నవతెలంగాణ – హలియా
పదవ తరగతి విద్యార్థి జీవితంలో తొలిమెట్టని, విద్యార్థులు నిర్భయంగా ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అనుముల మండలం చింతగూడెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా విద్యార్థులు క్రమశిక్షణ తప్పకుండా ముందుకు సాగినప్పుడు జీవితంలో తప్పక ఉన్నత స్థానానికి చేరుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు కావలసిన పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసినపాఠశాల పూర్వ విద్యార్థి వట్టి కోటి హరీష్, రెండు నెలల పాటు విద్యార్థులకు అల్పాహారం అందించిన కూరాకుల లింగయ్య లను సన్మానించారు. విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడ్డం శ్యాంప్రసాద్, యం. డి. పాషా, పురం వెంకటయ్య, డా. సాగర్ల సత్తయ్య, పేర్ల వెంకటేశ్వర్లు, దూసరి మధు, శ్రీనివాస్ సుజాత తదితరులు పాల్గొన్నారు.