
నవతెలంగాణ -తాడ్వాయి : బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్బు వెంకట్ రెడ్డి మృతి, బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ములుగు జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ పోరిక గోవింద నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అబ్బు వెంకట్ రెడ్డి దశదినకర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి పార్టీ ఎలావేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య, ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రశేనారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బంగారు సాంబయ్య, మండల ఉప అధ్యక్షులు చల్లా రజినికర్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జి తుమమల రాజేందర్, పెండ్యాల దశరథం, చింతల మహిపాల్, చింతల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.