ఆలేటి ఆటం వరల్డ్ అనాధాశ్రమంలో అనాధల నడుమ అబ్బులు గౌడ్ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ- చివ్వేంల
జై గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరగాని అబ్బులు గౌడ్ జన్మదిన వేడుకలను శనివారం మండలంలోని దూరాజ్ పల్లి లో గల ఆలేటి ఆటం వరల్డ్ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో అబ్బులు యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు రామగిరి నగేష్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల పేరుతో డబ్బులు వృధా చేయకుండా పేదలకు సహాయం చేయడం అలవర్చుకోవాలని సూచించారు.అబ్బులు గౌడ్ ను భగవంతుడు ఆశీర్వదించి, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.అనంతరం అబ్బులు గౌడ్ మాట్లాడుతూ ఆనాధల నడుమ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు..అనంతరం చివ్వేంల, అక్కలదేవి గూడెం గ్రామాలలో కేక్ కట్ చేసి స్వీట్ లు పంచి పెట్టారు..ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు నల్లబోతు నాగరాజు, అమరగాని రామన్న, పొడిశెట్టి విజయ్, మండవ నాగరాజు, పుట్ట వెంకన్న,కొంగల రామలింగయ్య,కొంగల ప్రవీణ్,పడిశాల నాగరాజు, వేముల వినోద్, నరేష్ రెడ్డి, నరసింహ, మిర్యాల వాసుదేవరెడ్డి, మహేష్, మనోహర్, రాజేష్, అఖిల్, రవిరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..