ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

Abdul Kalam Jayanti Celebrationsనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూం రెడ్డి, వినోద్ గౌడ్, రమేష్ రెడ్డి, మనోహర్, మధు, బాల్ రెడ్డి, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.