నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటెయిల్ లైఫ్‌స్టైల్ (ఏబిఎఫ్ఆర్ఎల్) నుండి భారతదేశపు ప్రముఖ చేతివృత్తుల జీవనశైలి బ్రాండ్ అయిన జేపోర్, ఈరోజు హైదరాబాదులో తన మొదటి దుకాణం ప్రారంభాన్ని ప్రకటించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రారంభము, దేశములో తన ఉనికిని విస్తరించేందుకు ఒక అవకాశము అయినందున, జేపోర్ కు ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. హైదరాబాదులోని జూబిలీ హిల్స్ వంటి ప్రధాన ప్రాంతములో ఉన్న ఈ కొత్త దుకాణము, అద్భుతమైన దక్కన్ సంస్కృతి సున్నితమైన చేతిపనుల పట్ల జేపోర్ యొక్క నిబద్ధతకు ఒక ప్రామాణికము. హైదరాబాదులో జేపోర్ వారి మొదటి ప్రత్యేకమైన బ్రాండ్, జేపోర్ వారి ముఖద్వారం, ఒక రేఖాగణిత జాలి ద్వారా కనిపించే, పంజాబ్ కు చెందిన జానపద ఎంబ్రాయిడరీ సంప్రదాయం అయిన ఫుల్కారి హస్తకళ యొక్క ప్రతిబింబము. వినియోగదారులు కళలు చేతిపనులను ఆవిష్కరించేలా ఆహ్వానిస్తుంది. రష్మి శుక్ల, బిజినెస్ హెడ్, జేపోర్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటెయిల్ లిమిటెడ్ ఇలా అన్నారు, “భారతదేశములో, జేపోర్ వారి 20 దుకాణాలు ఉండగా, హైదరాబాదు మార్కెట్లో మా మొదటి దుకాణం ప్రారంభాన్ని ప్రకటించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము . వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన రీటెయిల్ షాపింగ్ అనుభూతిని అందిస్తూ, దేశవ్యాప్తంగా మా ఉనికిని పెంచుకొని శక్తివంతం చేసుకోవాలని ఆశిస్తున్నాము”, అని శ్రీమతి. శుక్ల్రా అన్నారు. దుకాణము మధ్యలో, దక్కన్ వారసత్వ సంస్కృతికి నివాళిగా పక్షిశాల యొక్క స్థానిక దృశ్యాలను చూపించే, ప్రామాణికమైన కలంకారి కళతో అలంకరించబడిన ఒక ఆకర్షణీయమైన గోడ ఉంది. ఈ అద్భుతమైన ప్రాతినిథ్యం, సంప్రదాయిక భారతీయ కళా రూపాలను సమకాలీన సందర్భములో ప్రదర్శిస్తూ, వాటిని పరిరక్షించుట ప్రోత్సహించుట పట్ల జేపోర్ వారి నిబద్ధతను తెలుపుతుంది. జేపోర్ వారి దుకాణము, తెలంగాణ వారి హస్తకళాకారుల నైపుణ్యము చేతిపనులను ప్రదర్శించే బిద్రి చేతితో-చెక్కిన గోడ ప్లేట్స్ ను చూపుతూ భారతీయ గొప్ప వారసత్వాన్ని చూపే అందమైన హస్తకళలను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ దుకాణము, ప్రేరేపించే 8-అడుగుల గోడ పెయింటింగ్ లో బిగించిన పిచ్వాయ్ కళల పునరుజ్జీవనం ద్వారా ఒక ఆకర్షణీయమైన అనుభూతిని అందిస్తుంది. వీటికి తోడు జైపూర్ నుండి తెచ్చిన కిలిం ధుర్రీస్ తో తయారుచేయబడిన సీటింగ్ వంటి పరిశీలనాత్మక ఆకర్షణలు ఈ ప్రదేశానికి అందాన్ని మరియు సౌకర్యాన్ని అదనంగా చేరుస్తాయి. ప్రత్యేకమైన రీటెయిల్ అనుభవాన్ని అందించడానికి తోడు, జేపోర్ వారి హైదరాబాదు దుకాణములో అనేక ఈవెంట్స్ వర్క్ షాప్స్ నిర్వహించబడతాయి. ఈ ప్రయత్నాలు స్థానిక కళాకారులకు తమ నైపుణ్యాలను పంచుకొనుటకు మరియు ఒక ఉత్సాహభరితమైన సంఘముతో కలిసి పనిచేయుటకు ఒక వేదికను సృష్టిస్తాయి. వినియోగదారులకు ఈ బ్రాండ్ కొన్ని ప్రారంభ ఆఫర్లు కూడా ప్రకటించింది. వినియోగదారులు రూ. 6,990/- కు కొనుగోలు చేసి 15% మినహాయింపు పొందవచ్చు. ఈ ఆఫర్ జులై 31, 2023 వరకు అమలులో ఉంటుంది.