నవతెలంగాణ-హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో డికెడబ్ల్యు ఉమెన్స్ కాలేజీలో అఖిల భారత భాష సాహిత్య సమ్మేళన్ 33వ జాతీయ మహసభలు వైబోవోపేతంగా జరిగాయి. ఈ సభలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన విక్రమ సింహపూరి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ విజయ భాస్కరరావు మాట్లాడుతూ భాషాభివృద్ది కోసం సాహితీ వేత్తలు రచయితలు కృషి చేయలన్నారు. అఖిల భారత భాష సాహిత్య సమ్మేళన్ సంస్థ అధ్యక్షులు వీరేందర్ సింగ్ అధ్యక్షతన జరిగిన సభలో దక్షిణ భారత ప్రాంతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ కడారి సత్యమూర్తి, కార్యదర్శి శృతి చతుర్వేది, ఆంద్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షులు పెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో కడారి సత్యమూర్తి, మహిళ విభాగం అధ్యక్షురాలు గోళ్ళమూడి పద్మవతి, కార్యదర్శి తంగిరాల చక్రవర్తి, వి.ఆర్.ఆనంద్ ప్రభు తదితరులను ఘనంగా సత్కరించారు. వందేమాతరం ప్రత్యేక సంచికను ముఖ్యఅతిథి ఆవిష్కరించారు. ఈ సంస్థ ప్రతియేట ఇచ్చే రాష్ట్రాభాష గౌరవ సన్మాన్ పురస్కారాన్ని పెరుగు రామకృష్ణకు, సరస్వతి సన్మాన్ పురస్కారాన్ని డాక్టర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్.గోపాల్ కృష్ణలకు భారత్ భాషా భూషణ్ కూర చిదంబరం, డాక్టర్ కర్నాటి లింగయ్య, సంస్కృతి భూషణ్ కాశీ విశ్వేశ్వరావు, సుదర్శనం వేణుగోపాలచార్య (వేణుశ్రీ), సాహిత్య శ్రీ బండారుపల్లి రామచందర్ రావు, కెవిఎల్‌ఎన్ ప్రసన్న కుమారి, కె.మాదవరావు, వైరాగ్యం ప్రభకర్ రావు, దాసరి శ్రీనాధ్ గౌడ్‌లకు అందజేశారు. అనంతరం బహూభాషా కవిసమ్మేళనం నిర్వహించారు.