తెలంగాణ సెయిలర్ల సత్తా

– 14వ మాన్‌సూన్‌ రెగట్టా
హైదరాబాద్‌ : 14వ మాన్‌సూన్‌ రెగట్టా పోటీల రెండో రోజు తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారు. అండర్‌-19 ఇంటర్నేషనల్‌ 420 క్లాస్‌లో ధరణి, మల్లేశ్‌ జోడీ ముందంజలో నిలిచారు. అగ్రస్థానంలో నిలిచి 9 పాయింట్లు సాధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జోడీలు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్‌-15 ఆప్టిమిస్ట క్లాస్‌ గర్ల్స్‌లో దీక్షిత (తెలంగాణ) టాప్‌ లేపింది. షాగున్‌ ఝా (మధ్యప్రదేశ్‌), శ్రేయ కృష్ణ (తమిళనాడు) టాప్‌-3లో ఉన్నారు. అండర్‌-15 ఆప్టిమిస్ట్‌ క్లాస్‌ బార్సులో ఏకలవ్య, శరణ్య యాదవ్‌, ఆకాశ్‌లు రాణించారు.