యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: ఎంఎన్ఓ శ్రీనివాస్ 

నవతెలంగాణ – పెద్దవంగర
నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎంఎన్ఓ బుధారపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో పలు యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యాంత్రిక జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురై శారీరక, మానసిక వ్యాధులకు లోనవుతున్నాడని అన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, అంజయ్య, తఖీ పాషా, గౌరీ శంకర్, శ్రీధర్, సత్యం, సారయ్య, రమేష్, ప్రభాకర్ సువర్ణ, కరుణ, హైమ తదితరులు పాల్గొన్నారు.