నిబంధనలకు విరుద్ధంగా అవినాష్ కాలేజ్ నిర్వహిస్తున్నారని ఏబీవీపీ ఆందోళన

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు విరుద్దంగా సుల్తాన్ బజార్ లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇంటర్ విద్యా ర్థులకు తరగతులు నిర్వహిస్తుందని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకున్నా, సెలవు రోజున తరగతులు ఎలా నిర్వహిస్తారని కాలేజీ సిబ్బందిని నిలదీశారు. శుక్రవారం ఏబీవీపీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ హరిప్రసాద్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు మూకుమ్మడిగా కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కాలేజీ సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుని, గేట్లకు తాళం వేసి, యాజ మాన్యాని కి సమాచారం అందించారు. గేట్లకు తాళాలు వేయడంతో ఆగ్రహించిన ఏబీవీపీ నాయకులు అక్కడే బైఠాయించి కాలేజీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినా దాలు చేశారు. దీంతో విద్యార్థి నాయకులు, కాలేజీ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యం సమాచారంతో అక్కడికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు విద్యార్థి నాయకులకు నచ్చజెప్పేందుకు యత్నిం చారు. విద్యార్థులకు బయటకు పంపించి, కాలేజీ ని మూసి వేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కాలేజీ యాజమాన్యంతో చర్చించి, విద్యార్థులను బయటకు పంపించడం తో ఏబీవీపీ నాయకులు తమ ఆందోళనను విరమించారు.