అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావస్తున్న కూడా ఈరోజు విద్యార్థుల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించడం లేదని, ప్రైవేటు పాఠశాలలు చదువుకు నిలయాలుగా ఉండాల్సింది పోయి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ ఎస్ ఎఫ్ డి విభాగ్ కన్వీనర్ సామల సాయికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం ,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జూపల్లి శివకుమార్, విజయ్ పవన సిద్దు, వంశీ, యశ్వంత్, మని, సాయిలు పాల్గొన్నారు.