నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఏడవ అంతస్తులో ఏసీ రిపేరింగ్ చేస్తుండగా టెక్నీషియన్ ప్రమా దవశాత్తు కింద పడి మృతిచెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ సమ్మద్(26)అనే యువకుడు ఆదివారం శివరాంపల్లిలోని కెన్ వర్క్ అపార్ట్‌మెంట్‌లో ఏడవ అంతస్తులో ఏసీ రిపేరింగ్ చేస్తున్నాడు. రిపేరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి పోయాడు. దీంతో ఘటనా స్థలంలోనే మహ్మద్ సమ్మద్ చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిం చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.