నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 13 నుంచి 23 వరకు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే, జులై 6 లోగా పాస్‌పోర్టును రిటర్న్ చేయాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో సీఎం తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం విదితమే. తాజాగా తాను విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతించాలనీ, పాస్‌పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఎం అభ్యర్థించారు. ఆస్ట్రేలియా, దావోస్, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. అందుకోసం ఆరు నెలల పాటు పాస్‌పోర్టు ఇవ్వాలని కోరారు. దీనికి ఏసీబీ కోర్టు సమ్మతించింది. అయితే, జులై ఆరో తేదీ లోపు పాస్‌పోర్టును మళ్లీ అప్పగించాలని స్పష్టం చేసింది.
సీఎం విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
12:34 am