కోటగల్లి బాలికల కష్టాల్లో ఏసీబీ తనిఖీ 

ACB inspection of the plight of Kotagalli girlsనవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లి బాలికల (ఎస్సీ) సంక్షేమ హాస్టల్ లో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు వసతి గృహ విద్యార్థినిలకు అందుతున్నాయా లేవా అని కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోట్ పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నాయా లేదా అనే కోణంలో పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హాస్టల్లో తనిఖీలకు వెళ్లడం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపుతుంది. గతవారం మున్సిపల్ ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ ఇంటిలో ఆదాయం కు మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ ఈసారి హాస్టల్ లో సోదాలు చేయడం వసతి గృహ అధికారుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించింది. హస్టల్ లలో విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందించకుండానే దొంగ బిల్లులు పెట్టి నిధులను కాజేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ తనిఖీలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను అలజడి రేపుతుంది.హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాల ఇతర విషయాలపై ఆకస్మిక సోదాలు చేస్తున్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మీద దాడులు చేస్తున్నట్లు తెలిసింది.ఈ దాడులు స్వయంగా నిజామాబాద్ ఏసీబీ డఎస్పీ శేఖర్ నేతృత్వంలో జరిగాయి. ఆయన వెంట నిజామాబాద్ ఏసీబీ సి ఐ లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.