నవతెలంగాణ- తాడ్వాయి
రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్ళీ (మంగళవారం) నేటి నుంచి ముమ్మరంగా కొనసాగింది. మండలంలో కామారం (పిటి), 174, మేడారం 406, పంబాపూర్ 207, లింగాల, కొడిశెల గ్రామాలలో దరఖాస్తులు స్వీకరించారు. ఉదయం నుండే వినతులు ప్రారంభమై బారులు తీరారు. 28 తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల విరామం ఏర్పడింది. ఈ క్రమంలో రెండు రోజుల గ్రామం తర్వాత నేడు 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ముమ్మరంగా సాగింది. మండలంలో స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, మండల ప్రత్యేక అధికారి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎం పి ఓ జాల శ్రీధర్ రావు ఆధ్వర్యంలో వినతులు స్వీకరించారు.