నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం గ్యారెంటీలను గత పోయిన నెల 28 తేదీ నుండి ప్రారంభించి ప్రణాళికగా వివిధ గ్రామాలలో భాగంగా అధికారులు స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, ఎమ్మార్వో తబితారాణి, ఎంపీడీవో లక్ష్మణ్ రావు, ఎంపీఓ నారాయణ, పంచాయతీ సెక్రెటరీలు, వివిధ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఎనిమిది రోజులుగా ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. శనివారం రాయిచెడు గ్రామపంచాయతీలో ఎంపీ ఓ నారాయణ, లక్ష్మాపూర్ ఎంపీడీవో లక్ష్మణరావు, పూర్య తాండ గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ ప్రజా పాలన కార్యక్రమాలను సందర్శించారు. ఈ ప్రక్రియ నాలుగు నెలలకు ఒకసారి ప్రారంభిస్తామని ఎవరైతే దరఖాస్తులు చేసుకొని వారు ఉంటారో ఎవరు ఆందోళన చెందవద్దని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు.