నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రజాపాలన అభయహస్తం ఆరోగ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగిసిందని జిల్లా జెడ్పిసిఈఓ రమాదేవి ఎంపీడీవో శేషాద్రి తాసిల్దార్ రాజు అన్నారు మండలంలోని బంజర వస్త్రం తండా పార్వతమ్మ గూడెం గ్రామాలలో దరఖాస్తుల హవానా కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం ఆరోగ్యానికి దరఖాస్తులను మండలంలోని వివిధ గ్రామాలలో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుల స్వీకరణ తీసుకున్నామని అన్నారు అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు ఈ ఆరు. గ్యారంటీల అమలుకై ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు మండలంలోని మొత్తం 15,457 కుటుంబాలు కలవని 15,912 దరఖాస్తులు వచ్చాయని అన్నారు కాగా రేషన్ కార్డు గాని ఇతర వాటికోసం4210 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు20122 మొత్తం వివిధ వాటికోసం దరఖాస్తు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చాయని అన్నారు వివిధ అవసరాల నిమిత్తం ఉన్నవాటికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చిర్ర లక్ష్మీ జనార్దన్ రెడ్డి జయ మాన్సింగ్ పరుపాటి రుక్మిణి వెంకటరెడ్డి పెరుమాండ్ల గుట్టయ్య నియోజకవర్గ ప్రత్యేక అధికారి సూర్యనారాయణ మండల ప్రత్యేక అధికారి రామారావు టీం లీడర్లు ఎంపీడీవో శేషాద్రి తాసిల్దార్ రాజు పంచాయతీ కార్యదర్శులు కృష్ణ ప్రసాద్ సందీప్ మండల వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి ఏపిఎం వరదయ్య రెండు టీంల సభ్యులు పాల్గొన్నారు.