రైతు బీమా దరఖాస్తుల స్వీకరణ..

నవతెలంగాణ – రెంజల్ 

(ఫార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్) రైతు బీమా దరఖాస్తులను ఈనెల 28 లోపు దరఖాస్తులు చేసుకోవాలని రెంజల్ మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ రైతు బీ మాకు అవకాశం ఉందని జూన్ 28 లోపు కొత్త పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారు స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్దకు వెళ్లి ఆన్లైన్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో చేరుటకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని ఆయన అన్నారు. 14 ఆగస్టు 1965 నుంచి 14 ఆగస్ట్ 2006 లోపు వయసు కలిగిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డు పుట్టిన తేదీ మాత్రమే పరిగణలోనికి తీసుకోబడుతుందన్నారు. జూన్ 28 లోపు గలవారు ఈ దరఖాస్తులకు అర్హులని ఆయన పేర్కొన్నారు.