
మండలంలోని మర్యాల రైతు వేదికలో రైతుల నుంచి రైతు బీమా దరఖాస్తులను ఏఈవో రాజశేఖర్ శనివారం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన రైతులంతా ఆగస్టు 4వ తేదీ లోపు రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లగుండ్ల తండాలో రైతు బీమా పెండింగ్ లిస్టులను గోడలపై అతికించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.