– టీజీపీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ – 2 పరీక్ష ప్రాథమిక కీకి సంబంధించిన అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను ఈ నెల 31 నుంచి ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్
గ్రూప్ 4 పీడబ్ల్యూడీ (ఎంహెచ్) అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒక కుటుంబ సభ్యున్ని వెంట తీసుకుని ఉదయం 9.15 గంటలకు వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఎడ్‌సెట్, పీఈసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్
టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ -2024 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను సెట్ల కన్వీనర్ విడుదల చేశారు. వీటి నోటిఫికేషన్లు ఈ నెల 31న విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.