కొనసాగుతున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ


నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని బట్టు తాండ, జగదాంబ తాండ, గోకుల్ తాండ లలో బుధవారం ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. మండలంలో ఆయా గ్రామాల్లో దరఖాస్తులను ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు స్వీకరిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచులు రెడ్డి నాయక్, రాజు నాయక్, మాలోత్ లలితా లింబాద్రి నాయక్, ఎంపీటీసీలు ప్రవీణ్ గౌడ్, సత్యాలి చంద్రు నాయక్, ఎంపీడీవో సవితారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు అరవింద్ రెడ్డి, రవి, రాజేష్, నాయకులు మద్దికుంట నర్సాగౌడ్ , గోకుల్ తాండ మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.