నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని మహమ్మదాబాద్ జీపీలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సర్పంచ్ లక్షెట్టి సాయలు గ్రామ ప్రజలతో దరఖాస్తుల స్వీకరణ పండుగ వాతావరణంలో కోనసాగింది. ఈ సంధర్భంగా గ్రామ సర్పంచ్ సాయులు మాట్లాడుతు నోడల్ అధికాలు మండల తహసీల్దార్ గంగాప్రసాద్, ఎంపివో యాదగిరి పర్యవేక్షణలో భాగంగా దరఖాస్తు చేసుకునే లబ్దిదారులకు ప్రతి ఒక్కరికి అందే విధంగా, దరఖాస్తులను పూర్తీ చేసే క్రమంలో ఇబ్బందులు తలేత్తకుండా ఏర్పాట్లను పూర్తీచేసి సక్రమంగా, ప్రశాంతంగా చేసారు. దరఖాస్తు చేసెందుకు వచ్చేవారికి త్రాగునీరు, టెంట్ నీడ కల్పించారు. దరఖాస్తులు స్వీకరించే జీపీ కార్యాలయంను మామిడి తోరణాలు, పూలతో అలంకరించి పండుగ వాతావరణంలా ఏర్పాట్లు చేసారు. ఆరు గ్యారంటిలలో పథకాల హమీలో భాగంగా స్వీకరణ ప్రజలు ఉత్సహంగా పాల్గోన్నారు. అధికారులు ధరఖాస్తులు అందించి ప్రతిఒక్కరికి రిసిప్ట్ లను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , నోడల్ అధికారులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీగా పాల్గోన్నారు.