
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో మంగళవారం నాడు ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభ గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ అధ్యక్షతన నిర్వహించగా గ్రామస్తుల నుండి ప్రజా పాలన దరఖాస్తులను సర్పంచ్ ఆధ్వర్యంలో స్వీకరించారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.