
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం భాద్యతలను స్వీకరించారు.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం లో టేక్నికల్ ఎఓ గా విధులు నిర్వహించే యం సూద మాధురి బదిలీపై డిచ్ పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి గా వచ్చారు.11ఏళ్ళ పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి గా ఉన్న రాంబాబు బదిలీపై అలుర్ వేళ్ళరు. ఇందల్ వాయి మండల ఇంచార్జీ వ్యవసాయ అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్ గుండే పోటుతో మృతి చెందాడంతో డిచ్ పల్లి వ్యవసాయ అధికారి రాంబాబు ఇంచార్జీ గా ఉన్నారు.కామరెడ్డి జిల్లా తాడ్వాయి మండల వ్యవసాయ శాఖ అధికారి గా ఉన్న శ్రీకాంత్ కుమార్ ఇందల్ వాయి మండల వ్యవసాయ శాఖ అధికారి గా భాద్యతలు స్వీకరించారు.