తొలి కవితా సంపుటి “పాలకంకులు” కవితా సంపుటికి ముద్రించడానికి స్వికరణ..

నవతెలంగాణ -డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మాధస్థ ప్రణవి రచించిన తొలి కవితా సంపుటి “పాలకంకులు “అనే కవితా సంపుటికి డాక్టర్ సి.నారాయణరెడ్డి 92వ జయంతిని పురస్కరించుకొని సుశీల నారాయణరెడ్డి స్మారక ట్రస్ట్ వారు ఈ కవిత సంపుటిని ముద్రించడానికి స్వీకరించారు .ఈ కవిత సంపుటి గురువారం తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కె.వి.రమణాచారి,ఎల్ శివారెడ్డి, సుద్దాల అశోక తేజ పాల్గొన్నారు. ఈ విధంగా మహిళ రచయితలు, కవయిత్రులు ఈ సాహిత్య సేవకు మరింత ప్రోత్సాహం అందిస్తుందని ఇలాంటి కవయిత్రి నిజామబాద్ జిల్లా ముద్దుబిడ్డ కావడం నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్న కవి, రచయిత, జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఎనుగందుల శంకర్ మాధస్త ప్రణవి కి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.