హీరో అల్లరినరేష్ ‘బచ్చల మల్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుబ్బు మంగాదేవి దర్శకుడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నాని శనివారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ సినిమా టీజర్ చూసి నరేష్‌కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం నాకు ఏదైనా చేయాలని ఉందని చెప్పాను. సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయింది. అది బ్లాక్‌బస్టరా, ఏ రేంజ్ అనేది టైమ్ డిసైడ్ చేస్తుందని చెప్పాను. నాకు నేనుగా ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్‌లో కూడా వచ్చేసింది. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. ‘మజ్ను’ సినిమా చేస్తున్నప్పుడు తను నా వన్ మేన్ ఆర్మీ. ఏ అవసరం ఉన్నా తననే అడిగేవాణ్ణి. ఆ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ తనది కూడా. అప్పుడే తను డైరెక్టర్ అయిపోతాడని చెప్పాను. ‘బచ్చలమల్లి’ చూసినప్పుడు సుబ్బుకి తన బలం దొరికిందని అనిపించింది. సుబ్బు బ్లాక్‌బస్టర్ కొట్టాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌కి బెస్ట్ విషెస్. ఈ క్రిస్మస్ మనదే. ఈ డిసెంబర్‌లో ‘పుష్ప2′ ఫుల్‌మీల్స్ పెట్టేసింది. ఈ సినిమా సక్సెస్‌తో ఈ డిసెంబర్‌ని మంచి డెసర్ట్‌గా ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘థ్యాంక్యూ నాని. సుబ్బు ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారో, అంతే అద్భుతంగా సినిమాని తీశారు. విశాల్ చంద్రశేఖర్ చాలా కొత్త సౌండ్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్‌తో ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది’ అని హీరో అల్లరి నరేష్ చెప్పారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని డైరెక్టర్ సుబ్బు మంగాదేవి తెలిపారు. నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ,’ఈ క్రిస్మస్‌కి మా ‘బచ్చలమల్లి’ మోత మోగిపోద్ది’ అని అన్నారు. డైరెక్టర్ యోగి మాట్లాడుతూ… నరేష్ గారు వెరీ ఇంటెన్స్ యాక్టర్. ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఫుల్ లెన్త్ చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈవెంట్ కి వచ్చిన నాని గారికి థాంక్యూ. డైరెక్టర్ సుబ్బు చాలా అద్భుతంగా తీశాడు. ఇలాంటి మంచి సినిమాని నిర్మించిన రాజేష్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు యాక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ఇందులో చాలా ఇంటెన్స్ రోల్ ప్లే చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. బచ్చల మల్లి క్యారెక్టర్తో నడిచే కథ . ఇలాంటి కథలు తీయడం చాలా కష్టం. సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ ని తీసుకుని చాలా అద్భుతంగా ఈ సినిమాని చేయడం జరిగింది. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రిస్మస్ మనదే’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
తారాగణం: అల్లరి నరేష్, అమత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
అదనపు స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ %వీ% నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి