అచ్చంపేట జర్నలిస్టు కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏకగ్రీవంగా ఎన్నిక

నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేట జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులుగా బండారు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా కాలూరి శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి  భాగ్యమ్మ  తెలిపారు. బుధవారం  పట్టణంలోని ప్రెస్ క్లబ్  భవనంలో జిల్లా కో ఆపరేటివ్ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి  భాగ్యమ్మ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ముందుగా 11 మంది డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .అధ్యక్షులుగా బండారు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా కాలురి శ్రీనివాసులు, కోశాధికారిగా దుమార్ల భాస్కర్, ఉపాధ్యక్షులుగా బాణల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు  కో ఆపరేటివ్ జూనియర్ ఇనస్పెక్టర్స్ మహమ్మద్ కుతుబుద్దీన్, పి సబిత అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి,భాగ్యమ్మకు సహకరించారు. అచ్చంపేట జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధ్యక్షులు బండారు శ్రీనివాసులు, తాలూరి శ్రీను లు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కాలంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లో భాగంగా సభ్యులందరికీ ఇండస్థలాలు అందరికీ వచ్చే  విధంగా కృషి చేస్తామని వారు ప్రకటించారు.