పోస్ట్ ఆఫీస్ ద్వారా యాక్సిడెంట్ బెనిఫిట్ అందజేత

నవతెలంగాణ- రామారెడ్డి
రామారెడ్డి పోస్ట్ ఆఫీస్ వద్ద శనివారం పోస్ట్ ఆఫీస్ ప్రమాద బీమా లబ్ధిదారునికి చెక్కును పోస్టల్ ఇన్స్పెక్టర్ సుస్మిత భేనర్జి   అందజేశారు. రామారెడ్డి పోస్ట్ ఆఫీస్ పరిధిలోని అంతంపల్లి గ్రామానికి చెందిన వడ్ల శ్రీనివాస్ పోస్టు ఆఫీస్ లో రూ 399 తో ప్రమాద బీమా తీసుకున్నారు. శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందగా, రూ 70000 వైద్య ఖర్చు రావడంతో, పోస్టు వారు, చేసుకున్న ప్రమాద బీమా కింద రూ 70 వేల విలువగల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ సుస్మిత బెనర్జీ, ఎస్ పి ఎం ఉపేందర్, సిబ్బంది రాజేందర్, సిద్దన్న,, ప్రేమ్, జబ్బర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.