
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పాముల పర్సయ్య ఇటీవల ప్రమాదంలో గాయపడి మృతి చెందగా వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రమాద బీమా రూపాయలు రూ.2లక్షల చెక్కును సోమవారం బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీనియర్ కార్యకర్త వంకాయల గట్టయ్యకు ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు గట్టయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు, ఆయన ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట జడ్పిటిసి మేకల రవి, ఎంపీటీసీ రవిచంద్రరావు, సీనియర్ నాయకులు రమణారావు, హరికృష్ణ, రాజిరెడ్డి, కట్ట తిరుపతి, శ్రీనివాస్, రవి, అరుణ్, మహేష్, శ్రీకాంత్, పరశురాములు, శ్రీనివాస్ తోపాటు తదితరులు ఉన్నారు.