– సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో సోన్ కాంబ్లే దిలీప్ అనే రైతుకు సంబంధించిన 30 క్వింటాళ్ల పొగాకు బట్టి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు పంట ఆగ్నికి ఆహుతి కావడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిలిందని వారు తెలిపారు. బాధితుడికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.