
పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి సుమారు 10గంటల సమయంలో స్థానిక ప్రజలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతి దేహాన్ని బయటకు తీయించారు. బోర్లాం గ్రామానికి చెందిన నాందేడం వెంకటి (48)ని గుర్తించారు. మృతుదేహన్నీ పోస్టుమార్టంకు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మండల కేంద్రంలోని వైన్ షాప్ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ పక్కన మురికి కాలువలో పడి మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. పెద్ద కొడప్ గల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వంట పని చేస్తాడని తెలిసింది. భార్య కోటవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.