ప్రమాదవశాత్తు వ్యవసాయ కూలీ మృతి


నవతెలంగాణ-వీణవంక: ప్రమాదవశాత్తు రైతు కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై బీ వంశీకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన డికరే రాజు (32) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు నాటు వేస్తుండగా నారు మోసేందుకు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు పొలంలోని బురదలో బోర్లా పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.