ఆదిలాబాద్ లో ప్రమాదవశాత్తు ఇస్త్రీ షాపు దగ్ధం

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని దస్నాపూర్ లో గల ఇస్త్రీ షాపు ప్రమాదవశత్తు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రజక సంఘం నాయకులు అక్కడికి చేరుకొని బాధితుడు కడదారపు సంటెన్నకు దైర్యం చెప్పారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఇస్త్రీ పనులు ముగించుకుని 8.30 గంటల వరకు షాపులో ఉండి ఇంటికి వెళ్లిపోయానని బాధితుడు సంటెన్న తెలిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో షాపుల్లో మంటలు చెలరేగుతున్నాయని చెప్పడంతో అక్కడి చేరుకున్నట్టు పేర్కొన్నారు. అప్పటికే అగ్రిమాపక అధికారులు మంటలను అదుపు చేశారన్నారు. షాపులో ఉన్న మూడు ఇస్త్రిలతో పాటు ఫ్యాన్, టెబుళ్లు, కూర్చీలు బట్టలు దగ్ధమయ్యాయని తెలిపారు. దాదాపు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు చెప్పాడు. అదే విధంగాఈ  విషయం తెలుసుకున్న సామాజికవేత్త ముడుపు మౌనిష్ రెడ్డి బాదితుడిని పరామర్శించి రు5.ఐదు వేల ఆర్థిక సాయం అందించారు.