మీర్జాపూర్ లో ప్రమాదవశాత్తు పశుగ్రాసం దగ్ధం 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన గూల్ల సదయ్యకు చెందిన పశుగ్రాసం బుధవారం వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు నిప్పుట్టుకొని  దగ్ధమైంది. పాడి పశువులు కోసం పెట్టుకున్న గడ్డి వాము దగ్ధం కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.రూ. 20 వేల రూపాయల విలువ గల పశుగ్రాసం దగ్ధం రైతు సదయ్య తెలిపారు.