సాయిరాం శంకర్ నటిస్తున్న మరో విభిన్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్‌తో పాటు గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ, ‘ఇదొక విభిన్నమైన కథ. అడ్వకేట్ పాత్రలో సాయిరాం శంకర్, పోలీసు పాత్రలో సముద్రఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో ఉత్కఠభరితంగా తీసుకెళ్ళే క్రైం, మిస్టరీ కథనాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. రాహుల్ రాజ్, గోపి సుందర్ పాటలు – స్కోర్ అద్భుతంగా వచ్చాయి. ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని అన్నారు. శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, రవి, పచముతు, భాను శ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ నటించిన ఈ చిత్రానికి డి. ఓ. పి – రాజీవ్ రవి, సంగీతం – రాహుల్ రాజ్, ఆర్. ఆర్ – గోపి సుందర్, ఎడిటర్ – కార్తీక్ జోగేశ్, ఆర్ట్ డైరెక్టర్ – సంతోష్ రామన్, కథ-మాటలు-దర్శకత్వం : వినోద్‌కుమార్ విజయన్.