కొఠారి కమిషన్ ప్రకారం జిడిపిలో ఆరు శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలి..

According to the Kothari Commission, six percent of the GDP should be allocated to the education sector.నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కొఠారి కమిషన్ ప్రకారం జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు ప్రిన్స్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రిన్స్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి పూర్తిగా అన్యాయం జరిగిందని వారు అన్నారు. 2025-26 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.50,65,345 కోట్లు దానిలో విద్యారంగానికి కేవలం రూ.1,28,650 కోట్లు అంటే 2.55 శాతం మాత్రమేనని అది సరైంది కాదని వారు మండిపడ్డారు. 2024-25 సంవత్సరం తోని పోలిస్తే కేవలం 3012 కోట్లు మాత్రమే పెంరిగిందని ఇది పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చెయ్యడమే అని వారన్నారు. దీని వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యను దూరం అయ్యే పరిస్థితి ఉందని, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేసే లాగానే నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. ఇప్పటికే జీఎస్టీ పేరు మీద విద్యారంగంపై 18% వసూలు చేయడం చేయడానికి వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి కొఠారి కమిషన్ ప్రకారం జిడిపిలో 6 శాతం లేదా బడ్జెట్లో విద్యా రంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య రంగం కి కేటాయించిన బడ్జెట్ పై తెలంగాణ ఎంపీలు స్పందించాలని వారు అన్నారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి హుస్సేన్, నాయకులు కళ్యాణ్, పవన్, మనోజ్, ప్రవీణ్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.