ఎన్జీ ఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరంపై నిర్ణయం: మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక , రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణుల సూచనల ప్రకారం కాళేశ్వరం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సృష్టం చేశారు. శుక్రవారం మంథని,మల్హర్ మండలాల్లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు పలుకార్య క్రమాల్లో పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా బిక్షేశ్వరాలయం,నాగులమ్మ అటవీప్రాంతంలో మానేరు ప్రక్కన పురాతన అలయాలైన నైన గుళ్ళను సందర్షించి ప్రత్యేక  పూజలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కాళేశ్వరం పై ప్రభుత్వం స్పష్టతతో ఉందన్నారు.నిపుణుల నివేదికల మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భారీనీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఇది వరకే సృష్టం చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక నిపుణుల సలహాలను తీసుకోకపోవడం వల్ల రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీధర్ బాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మహిళల ఉపాధి, సాధికారత కు సంబంధించిన రెండు మూడు రోజుల్లో శుభవార్త వెల్లడించనున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.