కౌంటింగ్ గోప్యతను కాపాడాలి..

– కౌంటింగ్ పై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ..
– జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కౌంటింగ్ గోప్యతను కాపాడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కె జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికలకు సంబంధించి జూన్ 4 వ తేదీన స్థానిక ఆరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ పురస్కరించుకొని మంగళవారం నాడు కలెక్టరేటు కాన్పరెన్స్ హాలులో ఉదయం తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహింపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు, మధ్యాహ్నం భువనగిరి, ఆలేరు, నకిరేకల్, జనగాం అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.  కౌంటింగ్ విధులలో కౌంటింగ్ గోప్యతను కాపాడాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని, నిష్పక్షపాతంగా, పారదర్శకతతో కౌంటింగ్  విధులు నిర్వహించాలని సూచించారు. తిరిగి జూన్ 2 న రెండవ విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించడం జరిగిందని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6.00 గంటలకు తమకు కేటాయించిన టేబుళ్ల వద్ద సిద్దంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇవిఎం యంత్రాల సీల్ తీయాలని, పోలైన ఓట్లను అభ్యర్ది వారిగా ప్రదర్శించాలని, పోలైన ఓట్ల వివరాలను సరిగా నమోదు చేయాలని, పూర్తి అప్రమత్తతతో పారదర్శకంగా కౌంటింగ్ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధరెడ్డి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డిలు ఉన్నారు.