పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు

– మార్చి నాటికి రూ. 4,80,687 కోట్లు ఎన్‌పిఎలు
న్యూఢిల్లీ : దేశంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎలు) పేరుకుపోతున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు తీసుకున్న రుణాలను ఈ పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మాఫీ చేస్తోంది. ఈ ఏడాది మార్చి 3 నాటికి రూ.4,80,687 కోట్లు ఎన్‌పిఎలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. మరోవైపు సహకార రంగ బ్యాంకింగ్‌ రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో 78 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు మూసివేత అయినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉరవకొండ కో ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌, తెలంగాణలో వాసవి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌, గోకుల్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ మూసివేశారు.