గాంధారి మండల కేంద్రంలో ఇటీవల దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ వారం రోజుల క్రితం గాంధారి మండల కేంద్రంలో గల సోయక్ పాషా ఇంటి నందు దొంగతనం జరిగిన విషయంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి గ్రామానికి చెందిన నిందితుడు అయిన వల్లెపు కాశిరాం S/o ఎల్లయ్య ను ఈరోజు ఉదయం బాన్స్ వాడ నందు అతని మామ ఇంటిలో ఉండగా, అదుపులోకి తీసుకొని అతని వద్ద గల దొంగిలించిన సొమ్మును, పల్సర్ బైక్ ను స్వాధీన పరుచుకొని, నేరస్టుడైన కాశీరాం ను జ్యూడిషల్ రిమాండ్ కు పంపనైనది. ఇతను పాత నేరస్తుడు ఇంతకు ముందు కామారెడ్డి నిజామాబాదు జిల్లాలలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు అయినాయి మరియు పి డి యాక్ట్ నందు ఒక సంవత్సరం జైలు కి వెళ్లి వచ్చినాడని గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.