నవతెలంగాణ- నవీపేట్: పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్లీ లిఫ్ట్ కాలువలో చంద్ర కళ (46)ను హత్య చేసిన ఇద్దరు నిందితులు గంగాధర్, గోదావరి లను అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు సిఐ సతీష్ కుమార్, ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన చంద్రకళను 50 వేల రూపాయలు అప్పు చెల్లించాలని కోరడంతో అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరూ గంగాధర్, గోదావరి లు నమ్మించి ఇంటికి పిలిచి హత్య చేసి ఆమె మెడలోని పట్ట గొలుసు, గుండ్లను తీసుకొని అలీ సాగర్ లిఫ్ట్ కాలువలో పడేశారని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వద్ద నుండి తీసుకున్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.