అచ్చంపేట ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగికి జైలు శిక్ష

నవతెలంగాణ – అచ్చంపేట
బ్యాంకు ఖాతాదారుల నుంచి వారికి తెలియకుండా మోసగించి డబ్బులను డ్రా చేసుకున్న సంఘటనలో బ్యాంకు ఉద్యోగికి జైలు శిక్ష పడింది అచ్చంపేట ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఎస్బిఐ బ్రాంచ్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్న భూమి రెడ్డి కిరణ్ కుమార్ తండ్రి మనోహర్ స్వస్థలం  కడప జిల్లా.  ప్రస్తుతం అచ్చంపేట అనే అతను 2018 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు అట్టి ఎస్బిఐ ఏసీబీ బ్రాంచ్ లో అకౌంట్లు కలిగి ఉన్న అమాయకపు ఖాతాదారుల సేవింగ్ అకౌంట్ లో నుండి వారికి తెలియకుండా మోసపూరితంగా వారి ఖాతాలో ఉన్న డబ్బులను 1 కోటి 49 లక్షల 50 వేల రూపాయలను విత్ డ్రా చేసి వాటిని తన భార్య అయిన శ్రీమతి సోమాల ప్రశాంతికి, అదే బ్రాంచ్ లో ఉన్న వివిధ అకౌంట్లోకి బదిలీ చేసి అట్టి డబ్బులను తన స్వప్రయోజనాలకు వాడు వాడుకున్నాడు.  ఖాతాదారులను బ్యాంకును మోసగించి నమ్మకద్రోహం చేసిన కిరణ్ కుమార్ ఉద్యోగి ఉద్యోగిపై  బ్రాంచ్ మేనేజర్  ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇట్టి వ్యక్తిని మంగళవారం తేదీ 24.09.2024 అచ్చంపేట సిఐ జి.రవీందర్  అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అచ్చంపేట న్యాయమూర్తి  నిందితునికి రిమాండ్ విధించగా జైలుకు తరలించినైనది.