మండలంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయులు ఆచార్య జయ శంకర్ సర్ అని, ఆయన సేవలు మరువలేనివని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ పాల్గొని విద్యార్థులతో కలిసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్, ఐకెపి ఎపిఎం కుంట గంగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, పంచాయతీ కార్యదర్శి నరేందర్, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.