సమానత్వం సామాజిక న్యాయం సాధించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి

– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ 
నవతెలంగాణ-కంఠేశ్వర్ : సవానత్వం సామాజిక న్యాయం సాధించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 86వ వర్ధంతి సందర్భంగా నిజాంబాద్ జిల్లా పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమానత్వం సామాజిక న్యాయం సాధించటమే అంబేద్కర్కు నిజమైన నివాళి అని పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచ మేధావిగా కొనియాడుతున్న గొప్ప సామాజిక వేత్త, సమాజానికి అందించి కుల, మత, లింగ, భాష, ప్రాంతీయ భేదాలకు స్వస్తి పలికించిన మహా మేధావి అని కొనియాడారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి సంవత్సరాలు దాటిపోతున్న కుల వివక్ష, మత విద్వేషాలు పెరుగుతుండడం పాలకవర్గాల వైఖరి కారణం అని అన్నారు. అంటరానితనం, మత భావాలతో దేశం అభివృద్ధి చెందదని అన్నారు. తరతరాలుగా నిమ్న వర్గాల ప్రజలు, కార్మికులు ఆధిపత్య వర్గాలకు సేవలు చేస్తూ అనేక కష్టాలు, ఒడిదుడుకులు అన్నారు. అణగారిన కులాల ప్రజలు, కార్మికులు, కర్షకులు ఐక్య ఉద్యమాల ద్వారా తమ హక్కులు సాధించుకోవడమే అంబేద్కర్ కు నివాళులు అర్పించడం అవుతుందనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు రాజయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.