నవతెలంగాణ -దుబ్బాక
పదో తరగతి విద్యార్థులు త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా చదవాలని హెచ్ఎం నీలం శ్రీనివాస్ సూచించారు. పదిలో ఉత్తమ ఫలితాలు పొందేలా కష్టపడి చదువుకోవాలన్నారు. మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరంపల్లి జడ్పీహెచ్ఎస్ లో బెల్లోజి రమేష్ చారి సహకారంతో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వారి వెంట పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.