వక్రభాష్యాలు చెప్పడం వైసిపికే చెల్లు: అచ్నెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా అధికార వైసిపి నాయకులు, మంత్రు లు పనిచేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారుపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజకీ య ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైసిపికే చెల్లిందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో సర్వోన్నత న్యాయం స్థానం ఇచ్చిన తీర్పును కూడా వక్రీకరించడం వైసిపి నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై విషం చిమ్మడం వైసిపికి పరిపాటిగా మారిందన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జడ్జిమెంట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినందున భారత ప్రధాన న్యాయమంత్రి (సిజెఐ)కి నివేదిస్తే దాన్ని కూడా రాజకీయ లబ్దికి వాడుకోవడం తగదన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా అరెస్టు జరిగిన ఈ కేసులో 17ఎ పై న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు చెప్పా రు. అయితే ఈ అభిప్రాయాలను తప్పుదోవ పట్టించేలా వైసిపి వక్రీకరిస్తోందని విమర్శించారు. ఈ కేసు పూర్తిగా 17ఎ వర్తిస్తుందా లేదా అనే అంశానికి సంబంధిం చి సాగిందని, కేసు మూలాలు, ఇతర అంశాలు ఏవీ ఈ తీర్పులో చర్చకు రాలేదని గుర్తు చేశారు. చంద్రబాబు కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం కూడా చూపలేకపో యారని విమర్శించారు. హైకోర్టు బెయిల్‌ ఉత్వర్వుల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రూ.43 వేల కోట్ల అవినీతిలో కూరుకుపోయి 3,500 వాయిదాలతో రోజులు నెట్టకొస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దళం కూడా తమపై విమర్శలు చేస్తే ప్రజలెవ్వరూ హర్షించరని తెలిపారు.